అక్కా..మీరు జైలుకెప్పుడెళతారు ?

Sister..when will you go to jail?– లిక్కర్‌ స్కామ్‌లో మీ వాటా ఎంత !
– ఎమ్మెల్సీ కవిత ట్విట్‌కు నెటిజన్ల కౌంటర్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంగతి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆమె అడుగు జాడలు అన్నీ తన తండ్రి సీఎం కేసీఆర్‌ను పోలి ఉంటాయి. సోషల్‌మీడియాలోనూ ఆమె యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. శనివారం యథాలాపంగా ‘మరో అరగంటలో కలుద్దాం..మీరు ప్రశ్నలేయండి.. మీ ఆలోచనలు చెప్పండి..మీ శక్తిని ప్రదర్శించండి’ అంటూ ఎక్స్‌(ట్వీటర్‌)లో ఒక పోస్టు పెట్టారు. అనంతరం మరో రెండు గంటల్లోనే భారీ స్పందన కనిపించింది. అనుకూల, ప్రతికూల ప్రశ్నలతో ఎక్స్‌ మార్మోమోగింది. నెటిజన్లు వేలల్లో రీట్వీట్లు చేశారు. రకరకాల ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో కొన్ని రకాల ప్రశ్నలు ఇలా ఉన్నాయి. లిక్కర్‌ స్కాంలో మీ వాటా ఎంత?, మీరు జైలుకు ఎప్పుడెలుతున్నారు?, బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ టీమా, ఎప్పుడు విలీనం చేస్తున్నారు?, కాళేశ్వరంపై మీ అభిప్రాయమేంటి?, కిలో నెయ్యి ధర ఎంత?, తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోతున్నారా? టీఎస్‌పీఎస్పీ పరీక్షలకు సంబంధించి కోర్టు కేసులను పరిష్కరించండి, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ఎప్పుడు ఓపెన్‌ చేస్తారు ?, కామారెడ్డిలో బాపు(కేసీఆర్‌) పోటీ నీకోసమే అంటకదా అక్కా?, మొత్తం ఎన్ని సిమ్‌కార్డులు వాడతారు అక్కా?, అంటూ స్పందించారు. అయితే ఈ ప్రశ్నలకు కవితక్క ఏమేరకు జవాబు చెబుతారనేది ఆసక్తిరేపుతున్నది.