31న ‘మేరా యువ భారత్‌’ ప్రారంభం

'Mera Yuva Bharat' started on 31stన్యూఢిల్లీ : దేశాభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసేందుకోసం ఈ నెల 31న ‘మేరా యువ భారత్‌’ వేదిక పేరిట స్వతంత్ర సంస్థను ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఆదివారం మన్‌ కీ బాత్‌ 106వ ఎపిషోడ్‌లో ఆయన మాట్లాడారు. దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించేందుకు ‘మేరా యువ భారత్‌’ అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఈ నెల పండగ సీజన్‌లో దేశవ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో ఖాదీ దుస్తులు, స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేశారని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ‘లోకల్‌ ఫర్‌ వోకల్‌’ నినాదానికి ఇది ఎంతో బలాన్నిస్తుందన్నారు. దేశంలోని యువతీయువకులు వ్‌ీదీష్ట్రaతీa్‌.+శీఙ.ఱఅ లో పేర్లు రిజిస్టర్‌ చేసుకోవాలని కోరారు. ‘అక్టోబరు 31న దేశంలో అతిపెద్ద సంస్థను ప్రారంభించబోతున్నాం. దాని పేరు మై యంగ్‌ ఇండియా, మేరా యువ భారత్‌. దేశాభివద్ధి కోసం నిర్వహించే కార్యక్రమాల్లో యువత కీలక పాత్ర పోషించేందుకు ఈ వేదిక అవకాశాలను కల్పిస్తుంది. యువశక్తిని ఏకీకతం చేయడానికి ఇదో వినూత్న ప్రయత్నం’ అని ప్రధాని తెలిపారు.