ఇమ్రాన్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి రాజీనామా

– బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా
నవతెలంగాణ – తాడ్వాయి
తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన బీఆర్ఏ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ తాడువాయి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఇమ్రాన్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో కొందరి పేత్తనమే నడుస్తుందని ఎవరిని పట్టించుకోవడంలేదని మండిపడ్డారు మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఒక్క మైనార్టీకి చెక్కు అందించలేదన్నారు బీసీ బందులో పూర్తిగా అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీసీ బందులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు తమ వర్గానికి చెందిన బీసీలకే బీసీ బందు అందించి చేతులు దులుపుకున్నారన్నారు అందుకోసమే తాను పార్టీలో ఉండలేక తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు