పోలింగ్ ప్రక్రియ విజయవంతానికి కృషి చేయండి

 – ఇ.ఆర్.ఒ, అదనపు కలెక్టర్ రాంబాబు
నవతెలంగాణ- అశ్వారావుపేట: ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ అనేది ప్రధాన ఘట్టం అని,దీని విజయవంతం పోలింగ్ సిబ్బంది పని విధానం పై ఆధారపడి ఉంటుందని అశ్వారావుపేట ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. రెండు పాటు పోలింగ్ సిబ్బందికి నిర్వహించే శిక్షణ శిబిరం సోమవారం స్థానిక వ్యవసాయ కళాశాలలో ప్రారంభించారు.ఈ శిక్షణ ను పరిశీలించడానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ పోలింగ్ సామాగ్రి అయిన బ్యాలెట్ బాక్సులు, యూనిట్ లు, పోలింగ్ నిర్వహణ, ఓటు వేసే విధానాలు అవగాహణ చేసుకోవాలని ఆయన సూచించారు.మొదటి రోజు పి.ఒ, ఎ.పి.ఒ లకు మొత్తం 280 మందికి నాలుగు గదుల్లో నలుగురు మాష్టర్ ట్రైన్స్ శిక్షణ ఇచ్చారని తెలిపారు. ఈయన వెంట ఎ.ఆర్.ఒ, తహశీల్ధార్ క్రిష్ణ ప్రసాద్, మండల నోడల్ అధికారి, ఎం.డి.ఒ శ్రీనివాస్ రావు ఉన్నారు.