అంతర్జాతీయ స్థాయిలో యోగకు మంచి ప్రాముఖ్యత ఉన్నది

అడిషనల్  కలెక్టర్ గరిమ అగ్రవాల్
నవ తెలంగాణ – సిద్దిపేట
అంతర్జాతీయ స్థాయిలో యోగకు మంచి ప్రాముఖ్యత.

ఉన్నదాని అడిషనల్  కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
టి టి సి  భవన్ లో మూడు రోజులపాటు జరగనున్న అండర్ 14 , 17 బాలబాలికల  రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ యోగా పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  పోటీలో మంచి ప్రతిభ చూపించాలని కోరారు.  యోగ  ను  ప్రతిరోజు చేయాలని చెప్పారు.  ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి  ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ జి ఎఫ్ కార్యదర్శి పన్యాల రామేశ్వర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీష్, రాష్ట్ర పరిశీలకులు కమలాకర్, కరుణం గణేష్ , ఇమ్రాన్, రవీందర్,  జిల్లా యోగా శిక్షణ అధ్యక్షులు నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్యదర్శిలు పాతూరు సుజాత,  గ్యాదరి బిక్షపతి, ఆస లక్ష్మణ్ , వ్యాయామ ఉపాధ్యాయులు ఏర్వ అశోక్ , బండారుపల్లి శ్రీనివాసులు, రమణారెడ్డి, ఉప్పలయ్య, వెంకటస్వామి హరికిషన్, రాజ్ కుమార్, రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.