సమయం సైతం లెక్కచేయకుండా ప్రచారం

నవతెలంగాణ :మలహార్ రావు
మండలంలోని వల్లంకుంట గ్రామంలోసమయాన్ని సైతం లెక్కచేయకుండా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ వచ్చే ఎన్నికల్లో గెలిపించేందుకు కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు సోమవారం వల్లంకుంట గ్రామంలో బి ఆర్ ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రాత్రి సమయంలో కూడా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ సొంత మేనిఫెస్టోను బీఆర్ఎస్ నాయకులు ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కోసం పాటుపడే నాయకుడి కోసం సమయంతో పని లేకుండా సైనికుల వలె కష్టపడి పని చేస్తామని, వచ్చే ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ గెలుపు ఆపడం ఎవరి తరం కాదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ ను ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.