– రోజు రోజుకి పెరుగుతున్న గులాబీ సైన్యం
– బీఆర్ఎస్ పార్టీ లో చేరిన గోల్ హనుమాన్ వైశ్య సంఘం అధ్యక్షుడు
– జెండా బాలాజీ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ చిన్న గంగారాం
నవతెలంగాణ- కంఠేశ్వర్: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గణేష్ బిగాల సమక్షంలో గోల్ హనుమాన్ వైశ్య సంఘం అధ్యక్షులు, జెండా బాలాజీ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ చిన్న గంగారాం సభ్యులు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో గోల్ హనుమాన్ వైశ్య సంఘం సెక్రటరీ తోట ఆంజనేయులు, సభ్యులు దొడ్లే శ్రీనివాస్, బొంపల్లి రాజేందర్ శ్రీ సంతోషి సాయి బాబా ఆలయ కమిటీ చైర్మన్ మాదని శ్రీధర్, కంటేశ్వర్ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కొవూరి జగన్ తదితరులు పాల్గొన్నారు.