వారసత్వ రాజకీయాలను పూర్తిగా ఖండిస్తున్నాం

నవతెలంగాణ హాలియా :సాగర్ నియోజకవర్గం హాలియా పట్టణ కేంద్రంలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముదిగొండ వెంకటేశ్వర్లు సభాధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పోలేపల్లి రాజేష్ హాజరై మాట్లాడుతూ… సాగర్ నియోజకవర్గం లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వారసత్వ ( తండ్రి తదనంతరం కుమారులను) రాజకీయాలలో వారిని పెంచి పోషిస్తూ ఈ నియోజక వర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలను మభ్యపెట్టి రాజకీయంగా తమ పబ్బం గడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సాగర్ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకుల పేద ప్రజలు ఆలోచన చేసి వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్ ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిని అధికార పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తక్షణమే కేంద్ర ప్రభుత్వం న్యాయ నిపుణులను ఏర్పాటుచేసి ప్రభుత్వ అవినీతిని వెలికి తీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ సాగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బత్తుల ప్రసాద్, నియోజకవర్గ కోశాధికారి రేపాక నరసింహ, నియోజకవర్గ మహిళా కన్వీనర్ బైరాగి విజయ, అనుముల మండల అధ్యక్షుడు జిల్లా మధు, త్రిపురారం మండల నాయకులు అశోక్ నాయక్, నిడమానూరు మండల మహిళా అధ్యక్షురాలు దుబ్బజ్యోతి, మధుశ్రీ, తదితరులు పాల్గొన్నారు.