బీఆర్ఎస్ లో భారీగా చేరికలు

నవతెలంగాణ- ఆర్మూర్:  పట్టణంలో మహాలక్ష్మి కాలనీకి  చెందిన కాలనీ వాసులు బీఆర్ఎస్ పార్టీలో మంగళవారం భారీగా చేరినారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించినారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పండిత్ పవన్, సంజయ్ సింగ్ బబ్లు, పోల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.