హోరెత్తిన కారు ప్రచారం పోటెత్తిన ప్రజాబలం

నవ తెలంగాణ-గోవిందరావుపేట :
వారంటీ లేని ఆరు గ్యారంటీలు మనకు వద్దు కెసిఆర్ సంక్షేమ పథకాలే మనకు ముద్దు ములుగు నియోజకవర్గం అభ్యర్థి ఎమ్మెల్యే బడే నాగజ్యోతి మండల వ్యాప్తంగా సోమవారం కారు ప్రచారం పోరెత్తింది. ప్రచారానికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. మండల కేంద్రంలోని   ఇంటింటి ప్రచారంలో భాగంగా బడే నాగజ్యోతి కి ప్రజలు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు.  మచ్చాపూర్ బుసాపూర్ చల్వాయి గోవిందరావుపేట , దుంపెలగూడెం, రాo నగర్ తండా , పస్రా సంత, మొద్దులగూడెం, లక్ష్మీపురం, కర్లపల్లి, చంద్రు తండా ప్రజానీకం-   భోనాలు,  బతుకమ్మలతో ఆడబిడ్డల స్వాగతం, చేపల వలలతో మత్స్యకారుల గౌడ్ అన్నలు వివిధ కుల పెద్దలు ఘనస్వాగతం పలికారు కాంగ్రేస్, బీజేపీ పార్టీలకు చెందిన సుమారు మండల వ్యాప్తంగా 1236 మంది బీఆర్ఎస్ లో చేరగా గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి  పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా  బడే నాగజ్యోతి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేసి.. సామాన్య ప్రజానికానికి అండగా నిలిచిన ఘనత బీ.ఆర్.ఎస్ కే దక్కుతుందని, కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలనకు కర్ణాటక రాష్ట్రంలో తలెత్తుతున్న పరిస్థితులు తాజా నిదర్శనమని అన్నారు. అభివృద్ధి పనుల పట్ల, ప్రజలకు ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేయడం, ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు.  కర్ణాటకలో రైతులకు పండించిన పంటలు ఎండిపోతున్నప్పటికీ.. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని వాగ్దానం ఇచ్చి… బస్సుల్లో పురుషులు మాత్రమే ప్రయానించాలని బోర్డులు పెట్టడం వారి అసమర్ధ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.. అన్నదాతల సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఘనత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని బడే నాగజ్యోతి గారు అన్నారు. కాంగ్రెస్ పాలనలో ₹200ల పెన్షన్ ఉండేదని కేసీఆర్ సీఎం అయ్యాక వికలాంగులకు₹4016, వృద్ధులు,వితంతువులు, ఒంటరి మహిళలు, బీడికార్మికులకు ₹2016 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని, మళ్లీ అధికారంలోకి రాగానే వికలాంగుల పెన్షన్₹6016, ఆసరా పెన్షన్ ₹5016 చేయడం జరుగుతుందన్నారు.రైతులకు పెట్టుబడి సాయం ఎకరాకు₹16వేలకు పెంచడం జరుగుతున్నదని, ప్రతి కుటుంబానికి రైతుభీమా మాదిరిగా ₹5లక్షల భీమా సదుపాయం కల్పించడం జరుగుతున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  మండల ఎన్నికల ఇంచార్జ్ సాంబారి సమ్మ రావు  గ్రంథాలయం చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి జడ్పిటిసి తుమ్మల హరిబాబు మండల అధ్యక్షుడు సూరపునేని సాయికుమార్  రైతు బంధు కోఆర్డినేటర్ పిన్నింటి మధుసూదన్ రెడ్డి బుర్ర సురేందర్ తలసిల ప్రసాద్ ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్ పృథ్వీరాజ్ ఉట్ల గోవిందరావుపేట మీడియా అండ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్  వైస్ ఎంపీపీలు,అన్ని గ్రామాల సర్పంచులు గ్రామ కమిటీ అధ్యక్షులు సీనియర్ నాయకులు ఉద్యమకారులు మండల అన్ని కులాల అధ్యక్షులు మహిళా అధ్యక్షులు అన్ని గ్రామాల మహిళా అధ్యక్షురాలు ప్రధాన కార్యదర్శులు కోపరేటివ్ బ్యాంకు డైరెక్టర్స్ మండల అన్ని గ్రామాల రైతు కోఆర్డినేటర్లు మండల ముఖ్య నాయకులు అన్ని గ్రామాల మాజీలు అధ్యక్షులు యూత్ సోషల్ మీడియా వారియర్స్ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.