బహుజనులు అందరూ ఏకం కావాలి

నవతెలంగాణ-పెన్ పహాడ్:
బహుజనులు అందరూ ఏకం కావాలని బీఎస్పీ మండల అధ్యక్షుడు భీమపంగు నాగరాజు అన్నారు. మండల పరిధిలోని అనంతారం గ్రామంలో బీఎస్పీ సూర్యాపేట నియోజక వర్గ అభ్యర్ధి వట్టే జానయ్య ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనులు రాజ్యాధికారం సాధించాలనే చైతన్యం ప్రజల్లో రావాలని, ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా విద్యార్థులను మోసం చేశారని, సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎడ్ల మహేష్, మామిడి వెంకటేశ్వర్లు, కొత్త శేఖర్, లింగ, మామిడి బాలనర్సింహా, జక్కి సాయి, మామిడి వినయ్, మామిడి అనిల్, తదితరులు పాల్గొన్నారు.