కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు..

– చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్..
నవతెలంగాణ- వేములవాడ: వేములవాడ పట్టణం లో నీ ఆది శ్రీనివాస్ నివాసంలో భారతరత్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 36వ వర్ధంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశ ఉక్కు మహిళ దేశ ఏకైక మహిళా ప్రధానమంత్రి  ఇందిరా గాంధీ అని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు భూములు ఇల్లులు పంపిణీ చేసిన ఘనత ఇందిరా గాంధీ అని కొనియాడారు.  దేశ ప్రయోజనాల కోసం తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన ఘనత ఇందిరాగాంధీ కుటుంబానికి దక్కుతుందని దేశ ప్రజలు  ఇందిరా గాంధీ  చేసినటువంటి సేవలు మరువలేనివని ఆయన వ్యాఖ్యానించారు. కూడు గుడ్డ అనే నినాదం తీసుకొచ్చి ఏ ఒక్కరి కూడా గుడిసెల్లో ఉండదని ఇందిరమ్మ ఇండ్లను కట్టించిన గొప్ప వ్యక్తురాలు అని వారు కొనియాడారు, బ్యాంకులను జాతీయకరణ చేసి ప్రతి పేదవాడికి చేరువలో బ్యాంకులు ఉండాలని తెచ్చినటువంటి ఇందిరాగాంధీని ఆయన అన్నారు. ఇండియా అంటే ఇందిరా ఇందిరా అంటే ఇండియా అనే విధంగా గొప్ప పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీని అలాంటి వ్యక్తురాలి అడుగుజాడలో ప్రతి ఒక్కరు నడవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు చిలుక రమేష్, కూరగాయల కొమరయ్య పాత సత్యలక్ష్మి కనికరపూ రాకేష్, నాగుల రాము గౌడ్, కోలాకాని రాజు, అక్కనపల్లి నరేష్, మూల కిషోర్, బొజ్జ భారతి, గుర్రం తిరుపతి, వస్తాది కృష్ణ, నేరెళ్ల శ్రీధర్, గంటల ప్రకాష్, లింగంపల్లి కిరణ్, ఎర్ర శ్రావణ్, సాబీర్, ఫిరోజ్, బాలసాని తేజ, నక్క సాయి తదితరులు ఉన్నారు.