నవతెలంగాణ- భువనగిరి: రైతు బంధు పథకంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి రైతులకు రైతుబంధు రాకుండా చేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ రాష్ట్ర నాయకులు చింతల్ ఎంకటేశ్వర్ రెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది అన్నారు. 2014 ముందు రైతు ఆత్మహత్యలు ఎలా ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత సాగు తాగునీటి ప్రాజెక్టులు పూర్తయి రైతులు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయాయి అన్నారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మూడు గంటల విద్యుత్ చాలు అని అంతకంటే రైతులకు అవసరం లేదని అంటున్నారని తెలిపారు. ఉత్తంకుమార్ రెడ్డి రైతు బంధు అవసరం లేదని పేర్కొంటున్నారు కర్ణాటక పిసిసి అధ్యక్షులు డీకే శివకుమార్ తమ రాష్ట్రంలో రైతులకు ఐదు గంటల నిరంతర విద్యుత్ తీస్తున్నామని అంటున్నారు. తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్తు అద్దెని చేసి రైతులను ఆదుకుంటున్నామన్న విషయమే మర్చిపోయారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని పేర్కొన్నారు రాష్ట్రంలో నెల రోజుల ముందే సీట్ల కేటాయింపు చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు కాంగ్రెస్లో సీట్ల పంపకాలు నేటికీ తేలలేదన్నారు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని ప్రశ్నించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలు ప్రజలు చీదరించుకుంటున్నారని తెలిపారు దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ ప్రచారంలో ఉంటే ఒక కార్యకర్త కత్తితో దాడి చేశారని తెలిపారు. మీ ప్రచారం మీరు చూసుకోండని ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. భౌతిక దాడలకు దిగితే సహించేది లేదన్నారు. ఐదారు సీట్లు రాష్ట్రంలో రాని ప్రభుత్వం బీసీ ముఖ్యమంత్రి చేస్తానని చెప్పడం ప్రగల్ బాలు పలకడమేనన్నారు.