శాంతి భద్రతలు అదుపులో ఉంచడం కోసం ఫ్లాగ్ మార్చ్

నవ తెలంగాణ _బొమ్మలరామారం
బొమ్మలరామారం మండల కేంద్రంలో రానున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మండల పరిధిలోని పిల్లి గుండ్ల తండా, మర్యాల, చౌదర్ పల్లి, పలు గ్రామాల్లో మంగళవారం సీఐఎస్ఎఫ్ బలగాలతో ప్లాగ్ మార్చ్ ను నిర్వహించినట్లు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రత పై ప్రజలకు భరోసా కల్పించడం కొరకు రూట్ మార్చ్ నిర్వహించారు. శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు.ఎన్నికలలో భాగంగా ముందస్తు భద్రత చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని ఎస్సై తెలిపారు.