పైసా వసూల్‌ సినిమా అని ఫీల్‌ అవుతారు

Paisa Vasool movie You will feel that‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ విజయాలతో అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ దాస్యం. ఆయన తన మూడో చిత్రంగా యూనిక్‌ క్రైమ్‌ కామెడీ మూవీ ‘కీడా కోలా’తో వస్తున్నారు. విజి సైన్మా బ్యానర్‌ పై ప్రొడక్షన్‌ నెం.1గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె.వివేక్‌ సుధాంషు, సాయికష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద్‌ నిర్మిస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ సినిమా నెల 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘లాక్‌ డౌన్‌లో చాలా మంది వినూత్నంగా ఇల్లీగల్‌ వేలో డబ్బులు సంపాదిస్తున్నారని తెలిసి నాకు చాలా కామెడీగా అనిపించింది. అయితే ఇదంతా క్రైమ్‌. కానీ దూరం నుంచి చూస్తే కామెడీ. ఇది నా ఫేవరేట్‌ జోనర్‌ కూడా. ఇప్పుడీ సినిమాతో క్రైమ్‌ కామెడీ చేయాలనే నా కల నిజమైంది. ఇందులో నటీనటులందరినీ ఆడిషన్స్‌ చేసి తీసుకున్నామని గర్వంగా చెప్పగలం. నా ఆల్‌ టైం ఫేవరేట్‌ ‘మనీమనీ’. అందులో బ్రహ్మానందం పాత్ర చాలా ఇష్టం. ఇందులో బ్రహ్మానందం పాత్రకు మా తాతయ్య స్ఫూర్తి. ఆయనది చాలా ఫన్‌ క్యారెక్టర్‌. అందరూ ఖచ్చితంగా ఎంజారు చేస్తారు. ముంబైలో ఈ సినిమా ప్రివ్యూ చూసినప్పుడు అందరూ ఎంజారు చేశారు. సినిమా చూస్తున్నంతసేపు హాయిగా నవ్వుకున్నారు. యూనిక్‌ రైటింగ్‌, మేకింగ్‌తో నవ్విస్తున్నాం. ఖచ్చితంగా ప్రేక్షకులు పైసా వసూల్‌ అని ఫీలౌతారనే నమ్మకం ఉంది. ఇందులో వాస్తు పాత్రకు టూరెట్‌ సిండ్రోమ్‌ పెట్టడానికి కారణం ఏంటంటే, ఏదైనా వైకల్యం ఉంటే దాని గురించి ప్రొజెక్ట్‌ చేస్తూ మాట్లాడటం కాదు.. వారికి సాధికారత ఇచ్చే విధంగా ఉండాలనేది నా ఆలోచన. ఇందులో అంతర్లీనంగా ఆ సందేశం ఉంటుంది. నా దర్శకత్వంలో నేను నటించిన మొదటి సినిమా కావడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. వెంకటేష్‌తో సినిమా ఉంటుంది. సురేష్‌ బాబు ప్రొసీడ్‌ అవ్వమన్నారు. అయితే కథ కోసం మరింత సమయం తీసుకున్నాను. ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే ఒక వెబ్‌ సిరిస్‌ కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.