ఇండియా జారు, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో ఘనంగా జరిగింది. సినీ రంగానికి చెందిన సరికొత్త సాంకేతికతను అందరికీ తెలియజేసే పరిచయ వేదికగా సినిమాటిక్ ఎక్స్ పో నిలిచింది. ఈ ఏడాది జరిగిన సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్, వి.ఎఫ్.ఎక్స్, స్పెషల్ ఎఫ్టెక్స్ రంగాలకు చెందిన సరికొత్త టెక్నాలజీని పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి హీరో నాగార్జున, దర్శకుడు నాగ్ అశ్విన్ ముఖ్య అతిథులుగా విచ్చేయగా, తెలంగాణ రాష్ట్ర ఇండిస్టీస్, కామర్స్, ఐటీ డిపార్ట్మెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సినిమాటికా ఎక్స్ పో ఫౌండర్, తెలుగు సినిమాటోగ్రఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.జి.విందా, రోటో మేకర్ ఫౌండర్ మైక్, గ్రీన్ గోల్డ్ ఛీప్ మార్కెటింగ్ హెడ్ భరత్, కంట్రీ హెడ్ ఫర్ టెక్నికల్ బిరేన్ గోస్, నిర్మాత సుప్రియ, డ్యాన్సింగ్ ఆటం క్రియేటివ్ హెడ్, ఫౌండర్ సరస్వతి వాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, ”ఇప్పుడు రోజురోజుకూ టెక్నికల్‌గా ఎన్నో మార్పులు వస్తున్నాయి. హైదరాబాద్ అనేది సినిమా పరిశ్రమకు రాజధానిలా మారనుంది. ఇండియా జారు వారి గ్రాఫ్ అద్భుతంగా పెరుగుతూ వస్తోంది’ అని తెలిపారు. ‘ప్రాజెక్ట్ కె’ని పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా మూవీలా ఇక్కడి వీఎఫ్ఎక్స్ కంపెనీలతోనే చేద్దామని ప్రయత్నించాను. నెక్ట్స్ మూవీని ఇక్కడి వాళ్లతో కలిసి హాలీవుడ్ కంటే బెస్ట్ క్వాలిటీతో తీస్తాను’ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పారు.