– టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి పీసరి సురేందర్‌రెడ్డి
నవతెలంగాణ-షాబాద్
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని బీఆర్‌ఎస్‌ను ఓడిద్దామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి పీసరి సురేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం షాబాద్ లో పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. గత ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు, మూడెకరాల భూమి ఇస్తామని హామినిచ్చి నెరవేర్చలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడూ మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతోందన్నారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్‌తోనే రాష్ట్రంలో అమ లైందన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్పుడు ఇందిరమ్మ ఇండ్లు, పించన్లు, ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రియీంబర్స్‌మెంట్, 108 వంటి పథకాలను విజయవంతంగా అమలు చేసిం దని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను పకడ్బందీలను అమలు చేస్తామ న్నారు. బుధవారం మండలంలో పార్టీ ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి పామైన భీంభరత్ పాల్గొంటున్నట్లు తెలిపారు. మండలంలోని మన మర్రి, బోడంపహాడ్, అప్పారెడ్డిగూడ, లింగా రెడ్డిగూడ, అంతారం, కుర్వగూడ, సర్దార్ నగర్, కక్కులూర్, కేసారం గ్రామా ల్లో పాల్గొన్ననున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కార్యకర్తలు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గోని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండ లాధ్యక్షులు కావలి చంద్రశేఖర్, సీనియర్ నాయకులు తమ్మలి రవీందర్, ఆక్తర్‌పాషా, పెంటయ్య, యాదయ్య, నాయకులు రవి, శ్రీను, చెన్నయ్య, శేఖర్, శ్రీనివాస్, అశోక్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.