సౌదీ అరేబియా కోసం..

For Saudi Arabia– వెనక్కి తగ్గిన ఆస్ట్రేలియా
– ఫిఫా ప్రపంచకప్‌ బిడ్డింగ్‌
సిడ్నీ : గ్లోబల్‌ స్పోర్ట్స్‌ పవర్‌హౌస్‌గా ఎదిగేందుకు అడుగులు వేస్తోన్న సౌదీ అరేబియా.. ఆ దిశగా 2034 ఫిఫా మెన్స్‌ ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కులు దక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. 2030 ఫిఫా ప్రపంచకప్‌కు మొరాకో, పోర్చుగల్‌, స్పెయిన్‌లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2034 ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కుల కోసం ఫిఫా బిడ్డింగ్‌ ప్రక్రియ ఆరంభించింది. ఆసియా, ఓసియానా రీజియన్‌ నుంచి మాత్రమే ఆతిథ్య రేసులో నిలవాలి. ఆసియా ఫుట్‌బాల్‌ కాన్ఫెడరేషన్‌ మద్దతు సౌదీ అరేబియాకు ఉండటంతో.. 2034 ప్రపంచకప్‌ ఆతిథ్యానికి బిడ్‌ దాఖలు చేసే ఆలోచన ఆస్ట్రేలియా విరమించుకుంది. ఈ మేరకు ఫుట్‌బాల్‌ ఆస్ట్రేలియా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. బలమైన పోటీదారు ఆస్ట్రేలియా పోటీ నుంచి తప్పుకోవటంతో.. 2034 ఫిఫా ప్రపంచకప్‌ సౌదీ అరేబియాకు వెళ్లటం లాంఛనంగా కనిపిస్తోంది. 2022 ఫిఫా ప్రపంచకప్‌కు ఖతార్‌ వేదికగా నిలిచిన సంగతి తెలిసిందే.