రాజేంద్రనగర్‌ బీఆర్‌ఎస్‌ కంచుకోట

– ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
రాజేంద్రనగర్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌కి కంచుకోట అని, ఇక్కడ ఇతర పార్టీలకు స్థానం లేదని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు మరోసారి పార్టీని గెలిపిస్తారని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం పద్మశాలి పురానికి చెందిన పలువురు బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత రాజేంద్రనగర్‌ నియోజకవర్గం శర వేగంగా అభివృద్ధి జరిగిందని ఆయన తెలిపారు. పార్టీ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో అమలయ్యాయని ఆయన అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు చెప్పే మోసపూరిత మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. నియోజకవర్గంలో తను చేసిన అభివృద్ధి చూసి ప్రజలు నాలుగో సారి తనను గెలిపిస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రేమ్‌గౌడ్‌, మసన వెంకటేష్‌, ఎల్లప్ప రఘు, నరేందర్‌, తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్య సంఘం మద్దతు : కాటేదాన్‌లోని టీఎల్‌ఎం గార్డెన్‌లో జరిగిన ఆర్యవైశ్య సంఘ సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅ తిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ఆర్యవైశ్యులు ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ గెలిపించడానికి కృషి చేస్తామని వారు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు గణేష్‌ గుప్తా, లక్ష్మయ్య గుప్తా, బుచ్చయ్య గుప్తా, సోమ శ్రీనివాస్‌ గుప్తా, అనంతం, తదితరులు పాల్గొన్నారు.