సి విజిల్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి

– కోడ్‌ ధిక్కారణపై ఫిర్యాదులు ఇవ్వాలి
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతి హోలీకేరీ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
శాసన సభ ఎన్నికలు పారదర్శకంగా జరగడానికి ప్రజలు ‘సి-విజిల్‌యాప్‌’ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ భారతి హౌలీకేరీ తెలిపారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఓటర్లను ప్రలో భాలు పెట్టినా, ఓటరును భయ బ్రాంతులకు గురి చేసిన లేదా బలవంతంగా ప్రభావితం చేసిన సి-విజిల్‌ యాప్‌ ద్వారా ఎవరైనా సరే సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో సమస్యను పరిష్క రిస్తామని పేర్కొన్నారు. అందుకే ఎలక్షన్‌ కమిషన్‌ ప్రజల చేతిలో సి-విజిల్‌ అనే బ్రహ్మాస్త్రం పెట్టిందన్నారు. ఆండ్రాయిడ్‌ మొ బైల్‌ ఉన్న ఎవరైనా సరే సివిజిల్‌ యాప్‌ను ప్లే స్టోర్‌ ద్వారా డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. సమస్యను ఎప్పటికప్పుడు కెమెరా ఆన్‌ చేసుకొని ఫోటో లేదా వీడియో తీసి సమస్యను సంక్షిప్తంగా టైప్‌ చేసి పంపించాల్సి ఉంటుందని తెలిపారు. సి-విజిల్‌ ద్వారా చేసే ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచబ డుతుందనీ తెలిపారు. ఎన్నికలు సజావుగా పారదర్శ కంగా జరగాలంటే ప్రజలు తమ కండ్ల ముందు కనిపిస్తున్న అన్యాయాన్ని వెంటనే సి-విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. సివిజిల్‌ యాప్‌ సురక్షితమైనదనీ, దీనిని ఆపరేటింగ్‌ చేయడం సైతం చాలా సులువైనదన్నారు. ఇంగ్లీష్‌ లో కానీ తెలుగులో కానీ సమస్యను పంపించవచ్చని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రజలు సి-విజిల్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు.
సాక్ష్యం యాప్‌..
ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా వికలాంగులకు సాక్ష్యం అనే ఒక యాప్‌ తయారు చేసిందని తెలిపారు. ఈ యాప్‌ ద్వారా వివిధ రకాలైన సేవలు పొందుటకు అవకాశం కల్పించినట్టు వివరించారు. ఈ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌, ఆపిల్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొనవచ్చని కలెక్టర్‌ తెలిపారు.