నవతెలంగాణ-నిజాంపేట
మండల పరిధిలోని నస్కల్ నందగోకుల్ నగరం బచ్చు రాజు పల్లి, శౌకత్ పల్లి, తిప్పనగుల్ల గ్రామాలలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. గ్రామాలలో ఎమ్మెల్యేకు ప్రజలు జన నీరాజనంతో డప్పు చప్పుల మధ్య గిరిజన మహిళల నత్య ప్రదర్శనలతో మహిళలు గ్రామ యువకులు ఘన స్వాగతం పలికారు. నస్కల్ గ్రామంలో ఇల్లు కోల్పోయిన బాధిత మహిళలు ఎమ్మెల్యేకు మొరపెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె నస్కల్ గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్డు వెడల్పు లో భాగంగా ఇల్లు గోల్పోతున్న బాధితులకు ఇల్లు కట్టిస్తామన్నారు. ఇంటి స్థలం లేని ఎడల ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు 24 గంటల కరెంటు అందిస్తుంటే కాంగ్రెస్ నాయకులు రేవంత్రెడ్డి మూడు గంటల కరెంటు అందించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి, రైతుబంధు నిలిపివేయాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారన్నారు. 11 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ రైతులకు 24 గంటల కరెంటు ను రైతుబంధు రైతు బీమా కల్యాణ లక్ష్మి పథకాలు ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలారా ఇకనైనా గమనించండి కాంగ్రెస్ పార్టీ కల్లిబొల్లి మాటలకు నమ్మిమోసపోవద్దని. బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రైతుబంధు 16,000, 3000 ఉన్న పెన్షన్ 5000 కు పెంచుతామన్నారు.గహిణి మహిళలకు 1200 ఉన్న సిలిండర్ ను 400 రూపాయలకే అందిస్తామన్నారు. కర్ణాటకలో పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పాలన నచ్చక కర్నాటక ప్రజలు తెలంగాణ వైపుకె చూస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో హైట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ఎన్నికలను ప్రశాంతమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ప్రచారం చేసుకోవాలని శాంతియుతంగా ఎన్నికలు జరుపుకోవాలని నాయకులకు ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలోమండల ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు,మండల అధ్యక్షుడు పరిపాటి సుధాకర్ రెడ్డి,సొసైటీ చైర్మన్లుఅందే కొండల్ రెడ్డి, బాపురెడ్డి మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ సంపత్ రామాయంపేట పిఎసిఎస్ చైర్మన్ బాజ చంద్రం, వైస్ చైర్మన్ సులోచన వెంకటస్వామి గౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి బి ఆర్ ఎస్ వి రంజిత్ గౌడ్, సర్పంచులు కవిత, బాల్ నర్సవ్వ, అనూష, గేమ్సింగ్, చంద్రవర్ధిని, నరసవ్వ, మండల కో ఆప్షన్ గౌస్, మాజీ జెడ్పిటిసి విజయలక్ష్మి, అనిత, బిఆర్ఎస్ నిజాంపేట అధ్యక్షులునాగరాజు, మండల యూత్ అధ్యక్షులు మావురం రాజు, అబ్దుల్ అజీజ్, లింగం గౌడ్, , సంగుస్వామి, మహేష్, ముస్తఫా, ఆకుల మహేష్, సంతోష్ కుమార్ గౌడ్, ఎల్లం యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.