రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం..

-కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చెవిటి సధాకర్
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని,బీఆర్ఎస్ పార్టీ నాయకులు బూటకపు ప్రచారం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చెవిటి సధాకర్ అన్నారు. బుధవారం మండలంలోని హరిపిరాల గ్రామంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మొదటిసారి జరిగిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రెండవసారి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ అమలు అమలు చేయకుండా మళ్లీ మూడోసారి అధికారంలోకి రావడానికి బూటకపు హామీలు చేస్తూ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ ఏరియా లో తెలంగాణ ప్రభుత్వం సక్రమంగా మూడు గంటల కరెంటు అందించడం లేదని టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే దానికి బిఆర్ఎస్ నాయకులు మూడు గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని వక్రీకరించి మాట్లాడుతున్నారన్నారు. ఈ మధ్యకాలంలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి రైతు బంధు రైతులకు ఉపయోగం లేని సమయంలో ఇస్తున్నారని మాట్లాడితే దానిని వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ రైతుబంధు వద్దని మాట్లాడుతున్నారని ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాట తప్పదని రాబోయే కాలంలో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేస్తుందన్నారు రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతుబంధు 15వేలు, కౌలు రైతులకు 12 వేలు, రైతులకు సబ్సిడీ ఇస్తుందన్నారు. రాహుల్ గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీ డిక్లరేషన్ అమలు చేస్తుందన్నారు. పాలకుర్తిలో మార్పు రావడం కోసం ప్రజలు యువ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి బలపర్చిన ఆమె కోడలు స్థానికురాలు బీటెక్ చదువుకున్న యువ నాయకురాలు పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన యశస్విని రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు.