రూ.427 కోట్లకు చేరిన ఎన్నికల స్వాధీనాలు

–  విస్తృతమైన తనిఖీలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న తనిఖీల్లో పట్టుబడిన స్వాధీనాల మొత్తం విలువ రూ.427 కోట్లకు పైగా ఉన్నదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం తెలిపింది. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన అక్టోబర్‌ 9 నుంచి నవంబర్‌ 1వ తేదీ ఉదయం 9 గంటల వరకు నగదు, మద్యం, మత్తు పదార్థాలు, బంగారం, వెండి, ఆభరణాలు, ఇతర ఉచితాల మొత్తం విలువ దీనిలో కలిసి ఉందని వివరించారు.