చిరుమర్తిపై అనుచిత వ్యాఖ్యలకు ఖండన

నవ తెలంగాణ -నకిరేకల్
టీఆర్ఎస్ నకరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య పై శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మార్పీఎస్ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మారపాక నరేందర్ మాట్లాడుతూ 24 గంటల్లోగా నేతి విద్యాసాగర్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పక్షాన చిరుమర్తికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరనున్నట్లు తెలిపారు. బీసీ వర్గానికి చెందిన విద్యాసాగర్ దళిత ఎమ్మెల్యేను అసభ్యకర పదజాలంతో దూషించడం అహంకారానికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు నకరికంటి అంజయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ ఎల్లేష్, మేడి నర్సింహ, జాతీయ ప్రధాన కార్యదర్శి నక్క కృష్ణ, జాతీయ కార్యదర్శి చింత సైదులు, నాయకులు మునుగోటి ఉత్తరయ్య, చింత లక్ష్మణ్, సిరిపంగి రామలింగయ్య, కందికంటి యాదగిరి, మల్లేష్, మేడి స్వామి పాల్గొన్నారు.