వినూత్న పాత్ర

An innovative roleరోహిత్‌ నందా హీరోగా, ఆనంది హీరోయిన్‌గా నో ఐడియా బ్యానర్‌ మీద రంజిత్‌ ఎస్‌ నిర్మించిన చిత్ర ‘విది’ó. శ్రీకాంత్‌ రంగనాథన్‌, శ్రీనాథ్‌ రంగనాథన్‌ ద్వయం తెరకెక్కించిన ఈ మూవీ నేడు (శుక్రవారం) థియేటర్లోకి రాబోతోంది. విడుదల సందర్భంగా హీరో రోహిత్‌ నందా మీడియతో మాట్లాడుతూ, ‘ఓరోజు యూట్యూబ్‌లో వి.ఎఫ్‌.ఎక్స్‌ వీడియోలు చూస్తుంటే ఓ వీడియో బాగా నచ్చింది. దాన్ని ఎవరు చేశారా? ఆరా తీస్తే ఈ దర్శక ద్వయం పరిచయం అయ్యింది. మా దగ్గర కూడా కథలున్నాయి, ముందు లైన్స్‌ వినండి అన్నారు. నేను సరేనన్నాను. అందులో ఓ లైన్‌ చాలా క్రేజీగా ఉందనిపించింది. నా రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌కి పూర్తి భిన్నమైన రోల్‌ను ఈ సినిమాలో చేశాను. రా ప్లేవర్‌తో సినిమా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను థ్రిల్‌ చేసే సినిమా ఇది. ఇలాంటి సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉంది’ అని అన్నారు.