బీఆర్ఎస్ లో చేరిన రజక సంఘం సభ్యులు

 – పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మంత్రి

నవతెలంగాణ కమ్మర్ పల్లి :  రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ అందిస్తున్న జనరంజక పాలన మెచ్చి కమ్మర్ పల్లి రజక సంఘం సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు రజక సంఘం సభ్యులు తెలిపారు.  శనివారం వేల్పూర్ లోని తన స్వగృహంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఎంపిటిసి సభ్యుడు మైలారం సుధాకర్, నాయకులు కొత్తపల్లి అశోక్ ఆధ్వర్యంలో రజక సంఘం సభ్యులు, సంఘ మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి  గులాబీ కండువా కప్పి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన రజక సంఘం సభ్యులు మాట్లాడుతూ మంత్రి ప్రశాంత్ రెడ్డి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. మంత్రి చేసిన అభివృద్ధి ముందు నియోజకవర్గంలో ఆయనను ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఎవరికి లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.