ఇది గుడ్డి పాయిరం తండ్రీ
గునుగు పువ్వులను సన్నజాజు లంటది
మోదుగ మొగ్గలను మొగిలి పువ్వు లంటది.
సంపెంగ పువ్వులను గడ్డిచేమంతు లంటది
తుంగ గడ్డిని తూణీర మంటది
గడ్డి పరకలను గంధం పొరక లంటది
కిలకిల పాడే కీరాలను డేగ లంటది
వేటాడి నెత్తుటి కూడు తినే రాబంధులను
పావురాలంటది
చౌడు భూములను సారవంతమ్కెన నేల లంటది
పండి పండి నెరివడ్డ నేలను పాటి గడ్డంటది
కదిలించీ, కదిలించనిది
కచ్చెడ్కెనా మన మట్టి పరిమళమేనంటది
సోయి మరిచి
నలుగురి నోళ్ళల్లో నానుడే
సోయి అయిన కలం కదలికను
సోయి గల సుక్క పొద్దంటది
– కందుకూరి అంజయ్య, 9490222201