ఆర్టీసీ స్వీపర్స్‌ వేతనాలు చెల్లించాలి

నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్‌
ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో పరిశుభ్రతగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు యం. రాంబాబు డిమాండ్‌ చేశారు. శనివారం సమస్యలపై వినతిపత్రాన్ని డిపో మేనేజర్‌ కార్యాలయంలో అందజేసి మాట్లాడారు.కొత్త బస్‌స్టేషన్‌,హైటెక్‌ బస్‌స్టేషన్‌లలో పని చేస్తున్న వీరికి సకాలంలో వేతనాలు చెల్లించడం లేదన్నారు.ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు లేవన్నారు.తెలంగాణ రాష్ట్రప్రభుత్వ కనీస వేతన చట్టాని సవరించని కార్మికులు ఉద్యోగులు ఆర్దికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర పండుగ దసరా పండుగ కూడా వేతనాలు చెల్లించని కారణంగా తెలంగాణ కార్మికులు పండుగ పూట పస్తులు ఉండాలిసన పరిస్థితి ఏర్పడిందన్నారు.ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించి వేతన బకాయిలు,ప్రతినెలా వేతనాలు కార్మికులకు చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో పట్నం జిల్లా కార్యదర్శి జె.నర్సింహారావు పాల్గొన్నారు.