కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దర్యాప్తు జరపాలి : వైఎస్‌ షర్మిల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కమీషన్ల కక్కుర్తి వల్లనే కాళేశ్వరానికి ఈ దుస్థితి పట్టిందని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ మాటలు పేరు గొప్ప ఊరు దిబ్బ లెక్కుందని ఎద్దేవా చేశారు. నా రక్తం, నా చెమట అని కల్లబొల్లి మాటలు చెప్పి నమ్మించాలని చూశారనీ, అయితే ఆ ప్రాజెక్టు పేక మేడల్లా కూలిపోయిందన్నారు. రాష్ట్ర ప్రజల సంపద రూ.1.27 లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినట్టు అని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజ్‌ పై డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు పరిశీలిస్తే.. మెగా అవినీతికి నిదర్శనమని విమర్శించారు.