– ఎమ్మెల్యే అభ్యర్థి మహేష్ రెడ్డి
నవతెలంగాణ-పరిగి
వారెంటీ లేని కాంగ్రెస్ గ్యారెంటీ పథకాలు నమ్మి మోసపోవద్దు అని ఎమ్మెల్యే అభ్యర్థి మహేష్ రెడ్డి అన్నారు. శనివారం పరిగి పట్టణ కేంద్రంలోని 13వ వార్డులో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇంటింటికీ ప్రచారం లో బీఆర్‌ఎస్ మేనిఫెస్టో ప్రజలకు వివరించారు. ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రతి గడపకు ఏదో రకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సమీర్, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, అన్వర్‌సెట్, మీర్ మహమ్మద్ అ లీ, 13వ వార్డు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు నరేందర్ తది తరులు పాల్గొన్నారు.