కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

నవతెలంగాణ-చింతపల్లి
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు నేనావత్‌ బాలునాయక్‌ అన్నారు.చింతపల్లి టీడీపీ మండల అధ్యక్షులు యాచారపు రవీంద్రగౌడ్‌ ఆ పార్టీ రాజీనామా చేసి అనంతరం బాలునాయక్‌ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మొత్తంలో ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామం లేదన్నారు.బడుగు, బలహీన వర్గాలకు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని వారన్నారు.రవీంద్రగౌడ్‌ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో బాలునాయక్‌ను గెలిపించుకుంటామన్నారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణ్‌ మాట్లాడుతూ ఇంకా 23 రోజులు మాత్రమే మిగిలిందని, ప్రత్యేక కార్యకర్త సైనికులాగా పనిచేసి దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీసీసీ వైస్‌ప్రెసిడెంట్‌ దొంతం సంజీవరెడ్డి, వింజమూరు మాజీ సర్పంచ్‌ వాంకుడోతు శక్రునాయక్‌, గజ్జెల వెంకట్‌రెడ్డి, తిరుపతినాయక్‌ పాల్గొన్నారు.