– ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్రెడ్డి
నవతెలంగాణ-వలిగొండ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఏ శక్తి అడ్డుకోలేదని భువనగిరి నియోజకవర్గంలో ఎగిరేది కాంగ్రెస్ పార్టీ జెండాయేనని, జనం కాంగ్రెస్ పార్టీని ఎంతగానో ఆదరిస్తున్నారని భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని ఎవరు అడ్డుకోలేరని నేను అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ఎంతగానో ఆదరిస్తున్నారని భువనగిరి నియోజకవర్గంలో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఉప్పెనల వస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎన్నో ప్రాజెక్టులు కట్టడం జరిగిందని కొన్ని ఏళ్లు గడిచినప్పటికీ నేటికి చెక్కుచెదరలేదని బిఆర్ఎస్ పాలనలో కట్టిన ప్రాజెక్టులు స్వల్ప కాలంలోనే నాణ్యత లోపాలతో ప్రమాదంలో ఉన్నాయని, కమిషన్ల కోసమే నాణ్యతకు తిలోదకాలిచ్చి ప్రాజెక్టులు కట్టారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు, విద్యార్థులు, యువత, జనం విసిగి వేసారి పోయారని కాంగ్రెస్ పాలనకోసం వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నారని అన్నారు. అంతకుముందు మండలంలోని వివిధ గ్రామాల నుండి అదేవిధంగా భవనగిరిలోని 14 వార్డు హుస్నాబాద్ లింగరాజు పల్లి నుండి 50 మంది అక్కంపల్లి నుండి 25 మంది మండల కేంద్రంలోని కుల సంఘాల నుండి కుంభం సమక్షంలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.