– మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి అంటే ప్రాణమిచ్చే వాళ్లు లక్ష మంది ఉన్నారు ..
– మునుగోడు ఉపఎన్నికల్లో నైతిక విజయం నాదే..
– కూసుకుంట్ల వందసార్లు వచ్చినా..నేనొక్కసారి వచ్చినా ఒక్కటే
నవతెలంగాణ-మునుగోడు
మునుగోడు నియోజకవర్గాన్ని అభివద్ధి చేయాలనే లక్ష్యంతో అసెంబ్లీలో అవకాశం దొరికినప్పుడల్లా నియోజకవర్గంలోని ప్రతి సమస్య మీద మాట్లాడిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నియోజవర్గ ప్రజలకు న్యాయం జరగాలంటే నా చేతిలో ఉన్న ఎమ్మెల్యే పదవి రాజీనామా అస్త్రాన్ని వదిలితేనే ప్రగతి భవన్ గోడలు బద్ధలై కేసీఆర్ మునుగోడు నియోజకవర్గ ప్రజల కాల దగ్గరికి వచ్చాడని మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని తమ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి నియోజకవర్గంలోని ఏడుమండలాల నుండి వేలాది మంది తరలివచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో కొట్లాడిన తప్పిస్తే మునుగోడు గడ్డ ప్రజలు ఎక్కడా తలదించుకునే పని చేయలేదన్నారు. పార్టీ మారినా మళ్లీ కాంగ్రెస్‌లోకే వచ్చినా.. నా ఏకైక లక్ష్యంకేసీఆర్ నియంత పాలనను అంతమొందించడమేనన్నారు.మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి అంటే ప్రాణమిచ్చే వాళ్లు లక్ష మంది ఉన్నారు.. రాజగోపాల్‌రెడ్డికి ప్రజాబలం ఉందన్నారు.ఒక ఎమ్మెల్యేని ఓడించేందుకు కేసీఆర్ ప్రభుత్వయంత్రాంగం వంద మంది ఎమ్మెల్యేను తీసుకొచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు.నా పదవి మునుగోడు ప్రజల కోసం వదిలిపెడితే మునుగోడు ప్రజలు ఎక్కడున్నారు అని అధికార యంత్రాంగం వంద మంది ఎమ్మెల్యేలు వచ్చి గట్టుప్పల్ మండలం, చండూరును రెవెన్యూ డివిజన్ చౌటుప్పల్లో వంద పడకల ఆసుపత్రి నియోజవర్గంలోని ప్రతి గ్రామంలో సిసి రోడ్లు నా రాజీనామా ఫలితంగానే వచ్చాయని తెలిపారు. ఆ మూడు నెలలు నిద్రపోకుండా వందమంది ఎమ్మెల్యేలను నియోజవర్గంలో దింపి గల్లి గల్లిన ప్రజల కాళ్లు వేళ్ళు పట్టుకున్న నా పైన అభిమానంతో ఈ కార్యక్రమంలో87 వేల ఓట్లు వచ్చాయంటే మొన్నటి ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచారంటే నైతికంగా రాజగోపాల్‌రెడ్డి గెలిచారని ప్రపంచమంతా చెబుతోందన్నారు.ఇప్పుడున్న మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల నియోజకవర్గానికి 100 సార్లు వచ్చినా ఒకటే..నేను ఒక్కసారి వచ్చినా ఒక్కటేనన్నారు.ఏ రాజకీయ సంచలనం జరగాలన్న.. రాజకీయ పెను తుఫాను రావాలన్నా మునుగోడు గడ్డమీది నుండే జరుగుతుందన్నారు. అభివద్ధి అంటే సిరిసిల్ల సిద్దిపేట అభివద్ధి చేస్తే రాష్ట్రమంతా చేసినట్లేనా అని ప్రశ్నించారు.లక్ష కోట్లు అప్పు చేసి కట్టిన కాలేశ్వరం ఎందుకు కుంగిపోయిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి నీర్లకంటి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్‌నేత, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతి, చౌటుప్పల్ ఎంపీపీ తాండూర్ వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నాయకులు వేమిరెడ్డి సురేందర్‌రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు , సర్పంచులు, ఎంపీటీసీలు , మాజీ సర్పంచులు తదితరులు ఉన్నారు.