రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘నరకాసుర’. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్‌లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు.
ఇటీవల విడుదలైన ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో సోమవారం నుంచి ఈ సినిమాను థియేటర్స్‌లో ఒక టికెట్ పై ఇద్దరు ప్రేక్షకులు చూసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ, ‘సినిమాకు థియేటర్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. రక్షిత్ బాగా నటించాడు, ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడనే ప్రశంసలు వస్తున్నాయి. మా సినిమాలోని మెసేజ్ మరింత మంది ప్రేక్షకులకు రీచ్ అవ్వాలని నేటి నుంచి గురువారం వరకు ఒక టికెట్ మీద ఇద్దరు ప్రేక్షకులు సినిమా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నాం’ అని అన్నారు. ‘మా సినిమాను పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్‌కు థ్యాంక్స్. సినిమా చూసిన వాళ్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది’ అని దర్శకుడు సెబాస్టియన్ చెప్పారు.
నిర్మాత డాక్టర్ అజ్జా శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘ఈ మూవీతో మా బ్యానర్ సుముఖ క్రియేషన్స్‌కు మంచి పేరొచ్చింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయని అంటున్నారు. విదేశాల నుంచి మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. మా సంస్థలో గుర్తుండిపోయే సినిమా చేసిన డైరెక్టర్ సెబాస్టియన్‌కి థ్యాంక్స్’ అని అన్నారు.