నిజ్జర్‌ హత్య ఆరోపణలపై ఆధారాలు సమర్పించండి : భారత రాయబారి

ఒట్టావా : ఖలిస్తానీ వేర్పాటువాద నేత నిజ్జర్‌ హత్య ఆరోపణలపై కెనడా ప్రభుత్వం ఆధారాలు చూపాలని భారత రాయబారి సంజరు కుమార్‌ వర్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ మీడియా గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌తో ఆయన మాట్లాడుతూ నిజ్జర్‌ హత్యలో భారతదేశ ప్రమేయం ఉందని ఆరోపించిన కెనడా, దాని మిత్ర దేశాలు స్పష్టమైన ఆధారాలు చూపించలేదని విమర్శించారు. ఈ కేసు దర్యాప్తులో వారికి సహాయం చేయడానికి నిర్దిష్ట లేదా సంబంధిత సమాచారం అందించలేదని చెప్పారు. ఈ దర్యాప్తు మొత్తాన్ని తారుమారు చేశారని ఆరోపించారు. ఈ హత్యలో భారత ఏజెంట్లు ఉన్నట్లు చెప్పాలని కెనడాలోని అత్యున్నత స్థాయి అధికారుల నుంచి సూచనలు వచ్చాయని అన్నారు.