
నవతెలంగాణ-గోవిందరావుపేట : పేద ప్రజల ఆశాజ్యోతి బడే నాగజ్యోతిని భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని బిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యాసుమలత అన్నారు. సోమవారం మండలంలోని పసర గ్రామంలోఇంటింటి ఎన్నికల ప్రచారం లో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సుమలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమలత ఓటర్లతో మాట్లాడుతూ పేద ప్రజల సమస్యలను అవగాహన చేసుకున్న పేద కుటుంబంలో పుట్టిన బడే నాగజ్యోతిని అసెంబ్లీకి పంపించినట్లయితే పేదల సమస్యల పట్ల తన వాయిస్ వినిపిస్తారని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సకాలంలో సక్రమంగా పేద ప్రజానీకానికి అందాలంటే తప్పనిసరిగా బిఆర్ఎస్ పార్టీని గెలిపించి తీరాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు., గ్రామ పార్టీ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్ చారి పసుల సమ్మయ్య పసుల భద్రయ్య బండి నాగేశ్వరరావు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.