స్వతంత్ర అభ్యర్థిగా ఇటికాల చిరంజీవి నామినేషన్ దాఖలు

నవతెలంగాణ- తుంగతుర్తి :తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి సోమవారం రోజు కూడా ఒకే ఒక నామినేషన్ పత్రం దాఖలైనట్లు తుంగతుర్తి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి,జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం నియోజకవర్గ కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో మాట్లాడుతూ ఇటికాల చిరంజీవి తండ్రి యాదయ్య స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశాడని తెలిపారు. ఈ మేరకు స్వతంత్ర అభ్యర్థి తరపున పదిమంది బలపరచాలని తెలిపారు. నేటి వరకు( సోమవారం) మొత్తం ముగ్గురి నామినేషన్ పత్రాలు స్వీకరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తాసిల్దార్ యాదగిరి రెడ్డి,డిప్యూటీ తాసిల్దార్ హరిచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.