– బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆనంద్
నవతెలంగాణ-బంట్వారం
మరో సారి నన్ను ఆశీర్వదించండి మరింత అభి వృద్ధి చేస్తానని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆనంద్ అన్నారు. మండల పరిధిలోని నూర్లాపుర్, సు ల్తాన్‌పూర్, యాచారం, మాలసోమరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ..సీఎం కేసీఆర్ ప్రజలకు సంపూర్ణ న్యాయం చేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలకూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కో రారు. మాలసోమారం మాజీ సర్పంచ్ ఎమ్మెల్యే సమ క్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో మర్పల్లీ వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ దుర్గం చెరువు మల్లే శం, పార్టీ మండలాధ్యక్షులు రాములు యాదవ్, పి ఎసిఎస్ చైర్మన్ రాంచంద్రా రెడ్డి, వైస్ చైర్మన్ సుధాకర్ గౌడ్, రైతుబంధు మండలాధ్యక్షులు ఖాజాపాషా, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఆల్లపురం శ్రీనివాస్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.