– అక్కడికక్కడే అత్యవసర ల్యాండింగ్
– ఎర్రవెళ్లి నుంచి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు వెళ్లబోతుండగా ఘటన
– మరో హెలికాప్టర్‌ను తీసుకువచ్చిన అధికారులు
నవతెలంగాణ-మర్కుక్, జగదేవ్‌పూర్
మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన కోసర ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్ర నుంచి హెలికాప్టర్లో సీఎం కేసీఆర్ బయల్దేరే క్రమంలో.. హెలీకాప్టర్‌లో సాంకేతిక సమస్యల తలెత్తెంది. గమనించిన పైలట్ అకడి హెలీ ప్యాడ్లోనే తిరిగి హెలికాప్టర్‌ను ల్యాండ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, జోగులాంబ గద్వాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ వెళ్లాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు హెలికాప్టర్లో సీఎం బయలుదేరారు. అయితే హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో.. వెంటనే గుర్తించిన పైలెట్ హెలికాప్టర్‌ను తిరిగి వ్యవసాయ క్షేత్రంలోని హెలీప్యాడ్ వద్ద అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దాంతో అధికారులు మరో హెలీకాప్టర్ తీసుకురావడంతో.. సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్రకు బయలుదేరి వెళ్లారు.