మీ కడుపున పుట్టిన బిడ్డగా.. మీ ముందుకొస్తున్నా ఆశీర్వదించండి

– బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టెజానయ్యయాదవ్‌
నవతెలంగాణ-సూర్యాపేట
మీ కడుపున పుట్టిన బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని.. ప్రతి ఒక్క తల్లి ఆశీర్వదించాలని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్‌ కోరారు.సోమవారం స్థానిక కుడకుడ గ్రామ పరిధిలోని మ్యాక్స్‌ ఆఫీస్‌ కార్యాలయంలో నిర్వహించిన అంత్యోదయ మహిళ పరస్పర సహాయ సహకార పొదుపు సంఘం ప్రతినిధుల మహాసభలో ఆయన మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలు కలిసి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసుకుంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేద ప్రజలను గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ,ప్రస్తుత ప్రభుత్వం వలన అప్పుల తెలంగాణగా మారిందని ఆరోపించారు.పావులావడ్డీ పేరుతో మహిళా సంఘాలను ఈ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు.పావులా వడ్డీ రుణాలు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఇంటి నుండి ఇచ్చేవి కావన్నారు.మనం పన్ను రూపంలో చెల్లిస్తే వచ్చే ఆదాయం నుంచి బ్యాంకులు మహిళలకు రుణాలు ఇస్తున్నాయని తెలిపారు.మహిళలు చైతన్యవంతులని గ్రహించి ప్రభుత్వం ఏర్పాటైతే రూ.3000 రూపాయలు ఇస్తామని మోసపూరిత మాటలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి మాటలు మహిళలు నమ్మవద్దని రానున్న ఎన్నికల్లో జగదీశ్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు.బడుగు బలహీన వర్గాల అభివద్ధి చెందాలంటే సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.ఈ సమావేశంలో మహిళల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
బీఎస్పీలో పట్టణవాసుల చేరిక
సూర్యాపేట పట్టణంలోని పలు వార్డులకు చెందిన యువకులు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలకు రాజీనామాలు చేసి సోమవారం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టెజానయ్య యాదవ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనులు అందరూ యువత యువకులు బీఎస్పీని గెలిపించాలని కోరారు.అనంతరం బీఎస్పీ నాయకులు పిడమర్తి ప్రశాంత్‌ ఆధ్వర్యంలో చేరిన వారిలో 29వ వార్డు ఇన్‌చార్జి ప్రవీణ్‌, మెడికల్‌ షాప్‌ల ఇన్‌చార్జి కోడి పర్శి, కష్ణ, సురేష్‌, వెంకన్న, ప్రవీణ్‌, దుర్గాప్రసాద్‌, శ్రీను, రంజిత్‌ ఉన్నారు.