ఆన్‌లైన్‌ సురక్షతను కాపాడుకోవాలని వాట్సప్ సేఫ్టీ క్యాంపెయన్ కోరుతోంది

నవతెలంగాణ: డిజిటల్ భద్రత ప్రాముఖ్యతను తెలియజేస్తూ, వినియోగదారులు తమ ఆన్‌లైన్ భద్రతపై నియంత్రణను తీసుకునేలా, తమ ప్రస్తుత సేఫ్టీ టూల్స్ మరియు ప్రొడక్ట్ ఫీచర్లపై అవగాహన పెంచే ప్రయత్నంలో భాగంగా ‘వాట్సాప్‌తో సురక్షితంగా ఉండండి’ అనే సేఫ్టీ క్యాంపెయిన్‌ను వాట్సప్ ప్రారంభించింది. వాట్సప్‌కు వినియోగదారుని భద్రత ప్రధాన అంశంగా ఉంది. సేఫ్టీ క్యాంపెయిన్ ద్వారా వినియోగదారులకు ఆన్‌లైన్ స్కామ్‌లు, మోసాలు మరియు అకౌంట్ కాంప్రమైజింగ్ బెదిరింపుల నుంచి సురక్షితంగా ఉంచుందకు సహాయపడే ప్రొడక్ట్ ఫీచర్ల గురించి వారికి అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తోంది. వాట్సప్ ప్రకారం, మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా మరియు రక్షణతో ఉండేలా చూసుకునేందుకు సులభమైన మార్గం మీ వాట్సప్ ఖాతాను సేఫ్టీగా ఉంచుకోవడమే. రెండు దశల వెరిఫికేషన్‌ను అనుసరించడం నుంచి మీ వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉండేలా చూసుకోవడం వరకు, మీ వాట్సప్ ఖాతాను సురక్షితంగా ఉంచుకునేందుకు వాట్సప్ టాప్ సేఫ్టీ ఫీచర్‌లు ఇక్కడ ఉన్నాయి.
1.మీ ఖాతాను సురక్షితంగా ఉంచేందుకు సెక్యూరిటీ లేయర్‌ను జోడించండి: మీ వాట్సప్ ఖాతాను రీసెట్ చేసేటప్పుడు, ధృవీకరించేటప్పుడు ఆరు-అంకెల పిన్‌తో Two-Step Verification feature ప్రారంభించడం ద్వారా వారి ఖాతాకు అదనపు సేఫ్టీని అందించేందుకు వినియోగదారులను వాట్సప్ అనుమతిస్తుంది. సిమ్ కార్డ్ దొంగిలించబడినప్పుడు లేదా ఫోన్ కాంప్రమైజ్ అయినప్పుడు ఇది సహాయపడుతుంది. మీ పిన్‌ నంబరును ఎవరితోనూ పంచుకోవద్దు. మీరు టూ-స్టెప్ వెరిఫికేషన్ పిన్ లేదా రిజిస్ట్రేషన్ కోడ్‌ని రీసెట్ చేసేందుకు ఎటువంటి రిక్వెస్టు పంపించకుండానే ఇ-మెయిల్ వస్తే, ఆ లింకుపై క్లిక్ చేయవద్దు.
2. మీ వ్యక్తిగత వివరాలను ఎవరు చూడాలో నియంత్రించేందుకు మీ ప్రైవసీ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయండి: వినియోగదారులు control their personal details – ప్రొఫైల్ ఫోటో, చివరిగా చూసిన, ఆన్‌లైన్ స్థితి, ఎబౌట్, స్టేటస్ మరియు ఎవరు చూశారు- అందరూ, కాంటాక్ట్స్ మాత్రమే, సెలక్ట్ కాంటాక్ట్స్ లేదాఎవరూ వద్దు ఇలా ఎంచుకోవచ్చు. మీరు మీ online presenceని ప్రైవేట్‌గా ఉంచాలనుకునే సమయాలకు, మీరు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఎవరు చూడగలరు మరియు చూడలేరు అనేదాన్ని ఎంచుకోవడం ద్వారా కూడా మీరు మీ ఆన్‌లైన్ ఉనికిని నియంత్రించవచ్చు. మీ వ్యక్తిగత వివరాలను మీ పరిచయాలకు మాత్రమే కనిపించేలా ఉంచడం వలన చెడ్డ వ్యక్తుల నుంచి మీ ఖాతాను రక్షించుకోవచ్చు.
3.సురక్షితమైన మెసేజింగ్ అనుభవాన్ని నిర్ధారించేందుకు గ్రూపు ప్రైవసీ సెట్టింగ్‌లు: వాట్సప్ privacy setting and group invite system అనేవి వినియోగదారులను గ్రూపులకు ఎవరు జోడించవచ్చో నిర్ణయించేందుకు అవకాశం కల్పిస్తూ, వినియోగదారుడి ప్రైవసీని మెరుగుపరుస్తుంది. మీరు భాగం కాకూడదనుకునే గ్రూపులకు మిమ్మల్ని చేర్చకుండా అడ్డుకుంటుంది. మీ కోసం కాని గ్రూప్ చాట్‌లో మీరు ఉండకూడదని భావిస్తే, అందరికీ తెలియజేయాల్సిన అవసరం లేకుండా మీరు గ్రూప్ నుంచి ప్రైవేట్‌గా నిష్క్రమించడాన్ని ఎంచుకోవచ్చు.
4.లింక్ అయిన మీ పరికరాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి: మీ వాట్సప్ ఖాతాతో లింక్ కాబడిన పరికరాలను క్రమం తప్పకుండా సమీక్షించండి. ఇది మీ ఖాతా యాక్సెస్ అయిన అన్ని పరికరాల లిస్టును మీకు చూపుతుంది. మీరు గుర్తించలేని వాటిని మీరు కనుగొంటే, వెంటనే లాగ్ అవుట్ అవ్వండి. వాట్సప్ వెబ్/డెస్క్‌టాప్ ద్వారా ఎవరైనా మీ ఖాతాను ఉపయోగిస్తున్నారని మీరు అనుమానం వస్తే, మీ ఫోన్‌తో అన్ని కంప్యూటర్‌ల నుంచి లాగవుట్ అవ్వండి.
5. అనుమానాస్పద ఖాతాలను బ్లాక్ చేసి, రిపోర్టు చేయండి: వాట్సప్ అనేది వ్యక్తులు వారి ప్రియమైన వారితో మరియు మీ ఫోన్ నంబర్‌ని కలిగి ఉన్న వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడానికి ఒక ప్రైవేట్ మరియు సురక్షితమైన స్పేస్. అయినప్పటికీ, వినియోగదారులు తెలియని నంబర్‌ల నుంచి సమస్యాత్మక సందేశాలను స్వీకరించే సమయాల్లో, వాటిలో కొన్ని అనుమానాస్పద లింక్‌లను కలిగి ఉండవచ్చు. మీ వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునేందుకు వారు ప్రయత్నించవచ్చు. వినియోగదారులు తమకు తెలియని అంతర్జాతీయ లేదా దేశీయ ఫోన్ నంబర్‌ల నుంచి కూడా కాల్‌లను స్వీకరించవచ్చు. వాట్సప్ ఖాతాని ‘block and report’ the account చేసేందుకు వినియోగదారులకు వాట్సప్ ఒక సులభమైన మార్గాన్ని అందిస్తుంది. బ్లాక్ చేయబడిన కాంటాక్ట్‌లు లేదా నంబర్‌లు ఇకపై మీకు కాల్ చేయలేరు లేదా మీకు మెసేజ్‌లు పంపలేరు.
6. తెరవెనుక పనిచేసే భద్రతా ఫీచర్లు: వాట్సప్ మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో సహాయపడే పలు సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. వినియోగదారులు ఏమీ చేసే అవసరమే లేకుండా ఈ పని చాలా వరనకు తెర వెనుకే జరుగుతుంది. ఈ security featuresలలో మీ ఖాతాను మరొక పరికరానికి తరలించడానికి అనధికారిక ప్రయత్నానికి మిమ్మల్ని హెచ్చరించే అకౌంట్ ప్రొటెక్ట్, మీ ఖాతాను ప్రామాణీకరించడంలో సహాయపడే అదనపు తనిఖీలను అందించే డివైస్ వెరిఫికేషన్ మరియు మీరు ఉద్దేశించిన గ్రహీతతో చాట్ చేస్తున్నట్లు నిర్ధారించడంలో సహాయపడే ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్‌లు ఉన్నాయి.