పశువుల గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం..

నవతెలంగాణ – నర్మెట్ట
మలక్ పేట గ్రామంలో పశుసంవర్ధక శాఖ, పశుగణ అభివృ ద్దిసంస్థ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిభిరం జరిగిం ది. నర్మట మండలం పశువైద్య అధికారి డాక్టర్ నేహా గోపాలమిత్ర సూపర్వైజర్ జయపాల్ రెడ్డి. ప్రారంభించారు. ఈశిభిరంలో 100 పశువులు రాగా వాటికి గర్భకోశ వ్యాధుల చికిత్స చేసి మందులు పంపిణీ చేయడం జరిగింది. డాక్టర్ నేహా మాట్లాడుతూ రైతులు పాడిపశువులకు స్టార్డెట్ సెక్స్ సెమెన్ వినియోగించుకోవాలని, దాని ద్వారా ఆడ దూడలకు జన్మనిస్తాయని, రైతులు దీనిని సద్వినియోగం చేసుకొని పాడి సంతతిని పెంచుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర డా.కొంపల్లి నగేష్ శ్రీను శివ సుభద్రం జేవివో మరియు భానుతు రవి రఘు మరియు గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు