నవతెలంగాణ- తుంగతుర్తి: తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని, అభివృద్ధి కొనసాగాలంటే ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి గాదరి కిషోర్ కుమార్ ను గెలిపించాలని ఏశమల్ల సృజన్ కోరారు. మంగళవారం గ్రామంలో బూతు ఇన్చార్జిలు,100 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించి గడపగడపకు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకొనే ఉద్యమ నేత మనకు ఎమ్మెల్యేగా దొరకడం నియోజకవర్గ ప్రజల అదృష్టం అని అన్నారు. అందుకే గాదరి కిషోర్ కుమార్ హ్యాట్రిక్ విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా కృషి చేయాలని సూచించారు. అభివృద్ధి జరగాలన్న సంక్షేమ పథకాలు కొనసాగాలన్న రాష్ట్రంలో కెసిఆర్ పాలన తప్పనిసరి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.