బహుజన బిడ్డగా నామినేషన్ వేస్తున్న..

ఆశీర్వదించండి ఆందోజు శంకరాచారి
నవ తెలంగాణ-చౌటుప్పల్ రూరల్: మునుగోడు బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆందోజు శంకరాచారి నేడు నామినేషన్ వేస్తున్నానని మంగళవారం విలేకరులతో తెలిపారు. బుధవారం చండూరు పట్టణంలో తాహాసిల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఆందోజు శంకరాచారి బహుజన బిడ్డగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. నేడు చండూరు మండలం అంగడిపేట నుండి 10:00 గంటలకు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేస్తున్నాను. కనుక మునుగోడు నియోజకవర్గ ప్రజలు బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఆర్ఎస్పి అభిమానులు విద్యార్థి సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని నా యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ చేరికల కమిటీ చైర్మన్ పల్లె లింగస్వామి, చౌటుప్పల్ మండల బిఎస్పి అధ్యక్షులు తగరం సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.