జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో మూడు రోజులుగా సయ్యద్ ఖైసర్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహ్మద్ ఇలియాస్ బాబర్ మెమోరియల్ జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీలలో తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల ధర్మారం(బి) విద్యార్థులు పాల్గొని ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచారని ధర్మారం బి గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ సంగీత తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో విద్యార్థులకు క్యాష్ అవార్డ్స్ లను సయ్యద్ కైసర్ అందించారు. వైస్ ప్రిన్సిపాల్ కిషన్, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ నీరాజరెడ్డి, పీఈటీ జ్యోత్స్న, ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులను అభినందించారు. గెలుపోందిన విద్యార్థులు ఎం సూజత ఇండివిజల్ ఓవరాల్ చాంపియన్ ఎ అంకిత, ఎన్ రశ్మిత, ఎల్ లిఖిత, కీర్తన, ఇందూ, మానస, ప్రణిత, బృంద ఉన్నారు.