
నవతెలంగాణ-మునుగోడు : గత తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు అకర్షితులై బీఆర్ఎస్ బలపడాల్సింది పోయి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి , మండల పార్టీ అధ్యక్షుడు బండ పురుషోత్తం రెడ్డి కారణంగా పార్టీ పూర్తిగా బలహీన పడిందని బీఆర్ఎస్ జిల్లా నాయకులు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి అన్నారు . మంగళవారం మండలంలోని చల్మడ గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బిఆర్ఎస్ కు రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత పార్టీ నాయకులను రాజకీయంగా ఎదగకుండా అణిచివేయడంతోపాటు ఇబ్బందులకు గురి చేయడంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూసుకుంట్లకు కార్యకర్తలు ,ప్రజాప్రతినిధులు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. 2018లో ఓటమిపాలు అయినా కానీ ఎమ్మెల్యే తీరులో మార్పు రాలేదని అన్నారు. జరగబోయే ఎన్నికలలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని తెలిపారు రాజీనామా చేసిన వారిలో చల్మడ గ్రామ శాఖ అధ్యక్షులు పగిళ్ల శ్రీరాములు, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు కొంక శంకర్, సింగిల్ విండో డైరెక్టర్ కొంక జ్యోతి శ్రీనివాస్, చల్మడ గ్రామ ఉప సర్పంచ్ గాదపాక లక్ష్మి యాదయ్య తదితరులు ఉన్నారు.