-దమ్మపేట ఆశీర్వాద సభలో చేరిక
-ప్రకటించిన ఎం.పి నామ
నవతెలంగాణ-అశ్వారావుపేట: కాంగ్రెస్ లో సీటు ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తున్నట్లు పార్లమెంట్ లో బీఆర్ఎస్ సభఆపక్ష నాయకులు,ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ నెల 13 న దమ్మపేట లో జరిగే ప్రజా ఆశీర్వాద సభా ఏర్పాట్లు పరిశీలించడానికి వచ్చిన ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతుండగా అధిష్టానం నుండి ఫోన్ రావడంతో నామ,ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు,ఎన్నికల పరిశీలకుడు వెంకట రమణ గదిలోకి వెళ్ళి రహస్యంగా మాట్లాడి వచ్చిన అనంతరం తాటి వెంకటేశ్వర్లు తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అయితే దమ్మపేట లో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు వచ్చే సిఎం కేసీఆర్ సమక్షంలో చేరే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.