దుంపల్లిగూడెంలో జోరుగా బీఆర్ఎస్ ప్రచారం

నవ తెలంగాణ-గోవిందరావుపేట: మండలంలోని లక్నవరం పంచాయతీ దొబ్బిలి గూడెం గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు బండి రాజశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం టిఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన పథకాలను వివరిస్తూ ప్రతి ఓటర్ను బడే నాగజ్యోతి  కారు గుర్తుకు ఓటువేయమని కోరడం జరిగింది. అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటెయ్యాలి. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే బడే నాగజ్యోతిని గెలిపించాలి. రుణమాఫీ సక్రమంగా అమలు కావాలంటే టిఆర్ఎస్ కు ఓటేయాలి. పెన్షన్లు నిలిచిపోకుండా ఉండాలంటే కెసిఆర్ ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి అంటూ  ప్రచారం కారు స్పీడుతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో *వైస్ ఎంపీపీ సుధీ రెడ్డి స్వప్న లక్ష్మారెడ్డి  సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి దొనికల రాఘవులు వల్లల వెంకన్న వెంకటస్వామి సీతారాం నాయక్ మల్లేశు ఎలంకొండ వెంకన్న పూసపాటి వెంకన్న పన్నాల శీను భాస్కసంపతు ఒడిచర్ల రమేష్ గజ్జల శీను బానోత్ రాజు ధోనికల యుగేందర్ రామకృష్ణ పొన్నాల శ్రీను మరియు యూత్ అధ్యక్షులు పున్నం రవి ఉపాధ్యక్షులు బొబ్బ శ్రవణ్  రెడ్డి గోపతి మహేందర్ ధరావత్ శ్రీకాంత్ కసాగాని శీను ఏర్పులు ఎంకన్న మేదరబోయిన కుమార్ లు పాల్గొన్నారు.