ఆర్ఎంపీ,పిఎంపీ సంక్షేమానికి కృషి

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీ,పిఎంపీ వైద్యుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీని కృషి చేస్తోందని జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిపేస్టో చైర్మన్– తెలంగాణ కాంగ్రెస్ మేనిపేస్టో పారమెడికల్ శిక్షణ అంశం
-మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు
నవ తెలంగాణ: మల్హర్ రావు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీ,పిఎంపీ వైద్యుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీని కృషి చేస్తోందని జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిపేస్టో చైర్మన్ దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు.మంగళవారం కాటారం డివిజన్ గ్రామీణ వైద్యులతో దుద్దిళ్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు మంథని నియోజకవర్గంలోని కొందరు గ్రామీణ వైద్య మిత్రులు పారా మెడికల్ శిక్షణ తరగతులు అంశాన్ని తన దృష్టికి తీసుకచ్చినట్లుగా తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2009లో ప్రత్యేక జీవోని తెచ్చి మెడికల్ శిక్షణ తరగతులు నిర్వహించినట్లుగా చెప్పారు. ఈ అంశాన్ని మేనిపేస్టో లో చెర్చినట్లుగా ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శిక్షణ తరగతులు పున.ప్రారంబించునట్లుగా తెలిపారు. ఇందుకు గ్రామీణ వైద్యులు శ్రీదర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్ఎంపీ,పిఎంపీ వెల్పేర్ అసోసియేషన్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్, జిల్లా మాజీ కార్యదర్శి, ఉపాధ్యక్షుడు దొడ్ల అశోక్, మంథని నియోజకవర్గ డివిజన్ అధ్యక్షుడు చారి,మల్హర్,కాటారం,మహదేవపూర్,పలిమేల మండలాల అధ్యక్షులు అశోక్,రమెస్ రెడ్డి,అంజన్న,జంగిడి సమ్మయ్య,సమ్మిరెడ్డి, వొన్న తిరుపతి రావు,రాజయ్య,శ్రీధర్, సుధాకర్,సత్యనారాయణ,లక్ష్మీ రాజాం పాల్గొన్నారు