ప్రజాసేవ కోసం ముందుకు వస్తున్నా… ఆశీర్వదించండి 

నవతెలంగాణ- నకిరేకల్: ప్రజాసేవ కోసం ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించాలని మాజీ ఎమ్మెల్యే దైద సుందరయ్య ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దైద రవీందర్ కోరారు బుధవారం నకిరేకల్ పట్టణంలోని గణేష్ నగర్ లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు గత ఐదేళ్లుగా స్థానికుడిగా మీ ప్రాంత బిడ్డగా మీ కష్టాల్లో బాధల్లో పాలుపంచుకున్నానని తెలిపారు భవిష్యత్తులో నేను చేసే ప్రతి ప్రయత్నంలో తమరి ఆశీస్సులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండ శంకర్ గౌడ్, నాయకులు యం.డి యూసుఫ్, చనగాని రాజశేఖర్ గౌడ్,  వంటెపాక సతీష్ , వంటెపాక నక్షత్, చనగాని నాగరాజు గౌడ్, జానీ, గిరి  పందిరి సతీష్ పాల్గొన్నారు.